Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మేనకా గాంధీ బృందం భేటీ
హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్స్, ఉన్నతాధికారులు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనక గాంధీకి వివరించిన అధికారులు. మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన అధికారులు. రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని తెలిపిన సీఎం.
అత్యాధునిక సౌకర్యాలతో విశాల ప్రదేశంలో ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి ఇప్పటికే శంకుస్ధాపన చేసినట్లు వివరించిన సీఎం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు, ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపిన సీఎం. జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసిన మేనకా గాంధీ. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించిన మేనకా గాంధీ.








