కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల చేతిలో శిక్ష తప్పదు : కేటీఆర్
తొలి వర్షానికే కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. హైదరాబాద్ ప్రజల నరకయాతనకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసమర్హతే కారణమన్నారు. రాష్ట్రానికి మున్సిపల్‌శాఖ మంత్రి తనే అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ప్రజల అవస్థల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దుర్మార్గం. వర్షం రాగానే చేతులెత్తేయడం సీఎం అసమర్థత కాకపోతే మరేమిటి? హైదరాబాద్ (Hyderabad) పరిస్థితిపై కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదు. డ్రైనేజీలు, మురికి కాల్వలను క్లీన్ చేసిన దాఖలాలే లేవు. వర్షాకాల ప్రణాళిక లేకపోడం వల్లే నిన్నటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. సీఎం భూములను కబళించడమే ఏకైక పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని అన్నారు.








