Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 16న విచారణకు హాజరుకావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)తో పాటు మరో ఆరుగురికి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని కవిత నివాసంలో సీబీఐ అధికారులు గురువారం నోటీసులు అందచేశారు. ఈ నోటీసులపై కవిత స్పందించారు. ఢిల్లీ మద్యం కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేయడంతో పాటు దర్యాప్తు అధికారిపై విచారణ చేపట్టాలని వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. నోటీసుల ఆధారంగా ఈనెల 16న విచారణకు హాజరవుతానన్నారు. ఈ విషయంపై తమ లీగల్ టీమ్ (Legal Team) తో చర్చలు జరుపుతున్నానని, న్యాయం గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని కవిత వెల్లడించారు.

ఇవి కూడా చదవండి








