హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో (Metro) కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో సర్వీసులను పెంచుతున్నట్లు ప్రకటించింది. మియాపూర్- ఎల్బీనగర్ (LB Nagar) మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ తిరగనుంది. నాగోలో- రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో సర్వీసు తిరగనుంది. చివరి మెట్రో రైలు సర్వీస్ రాత్రి 11 గంటల తర్వాతా పొడిగించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి








