Medaram : ఘనంగా వన దేవతల తిరుగువారం జాతర
సమ్మక్క- సారలమ్మ మహాజాతర ముగింపు పూజలు ఘనంగా జరిగాయి. తాడ్వాయి మండలం (Tadwai Mandal) మేడారం (Medaram)లోని సమ్మక్క(Sammakka), కన్నెపల్లిలోని సారలమ్మ (Saralamma) ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, దేవతలకు దూపదీప నైవేద్యాలు సమర్పించి జాతర పూజలను ముగించారు. ముగింపును పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








