తెలంగాణలో కొత్తగా 2 వేల కేసులు

తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా 24 గంటల్లో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704కి చేరగా, 1,741 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 13,362 యాక్టివ్ కేసులు ఉండగా, చికిత్స నుంచి కోలుకుని 3,03,601 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో 8263 మంది బాధితులు హోం ఐసోలేషన్‍లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‍ఎంసీ పరిధిలో 398, మేడ్చల్ జిల్లాలో 214, రంగారెడ్డిలో 174, నిజామాబాద్‍లో 169 చొప్ను ఉన్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 87,332 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.