Revanth Reddy: 2027 గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షలో చర్చ. 2027 జూన్ లో గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై సమావేశంలో చర్చ. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.
ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలన్న సీఎం. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని తెలిపిన సీఎం.
కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించిన సీఎం. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించిన సీఎం. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు. మాస్టర్ ప్లాన్ పై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం.
ఇవి కూడా చదవండి








