సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పై హైకోర్టు (High Court) తీర్పును వైసీపీ సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది. వార్డుల విభజన, స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు ఈనెల 1న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపడంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ( State Election Commission)ను ప్రతివాదిగా చేర్చింది. పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వైసీపీ (YCP) తరపు న్యాయవాది సీజేఐ వద్ద మెన్షన్ చేశారు. ఇదే తీర్పులో మరో పిటిషన్ కూడా దాఖలైందని ధర్మాసనం తెలిపింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశముందని, ఆలోపే విచారణకు తీసుకోవాలని వైసీపీ తరపు న్యాయవాది కోరారు. ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. తమ పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలని వైసీపీ తరపు న్యాయవాది కోరగా, చూద్దామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Suryakant) అన్నారు.








