విజయవాడ దసరా ఉత్సవాలు.. ఢిల్లీ సీఎం రేఖాగుప్తాకు ఆహ్వానం
విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా ఉత్సవాలు(Dasara celebrations), విజయవాడ ఉత్సవ్-2.0కు రావాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)కు మంత్రి సత్యకుమార్ యాదవ్ (Satya Kumar Yadav) , విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆహ్వానం పలికారు. విజయవాడ దసరా ఉత్సవాల విశిష్ఠతను రేఖా గుప్తా కు మంత్రి సత్యకుమార్, ఎంపీ చిన్ని ( Kesineni Sivanath (Chinni)) వివరించారు. విజయవాడ ఆధ్యాత్మిక, సంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటేందుకు విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహిస్తున్నట్లు తెలిపారు.








