అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు కిర్లంపూడి పోలీసులు (Kirlampudi police) నోటీలు ఇచ్చారు. ఈ నెల 8న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఆ రోజు తనకు వేరే పనులు ఉన్నాయని, ఎప్పుడు విచారణకు వస్తానో త్వరలోనే వెల్లడిస్తానని అంబటి పోలీసులకు తెలిపారు. జులై 16న ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham) అంత్యక్రియలను అంబటి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకుని నెట్టివేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కోసం పోలీసులు తాజాగా ఆయనకు (Notices) నోటీసులిచ్చారు.








