స్థానిక సంస్థల ఎన్నికల పై .. కూటమి నేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections)కు రంగం సిద్ధమవుతున్న వేళ, కూటమి నేతలు సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించారు. నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ( Madhav) సమావేశం కానున్నారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై చర్చించనున్నారు. స్థానిక సంస్థ ఎన్నికలకు ఈ నెలలో ఏ క్షణంలోనైనా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు డిసెంబర్ నాటికి మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.








