సమాజంలో గౌరవం లభించడమే.. అసలైన సక్సెస్ : కేంద్రమంత్రి పెమ్మసాని
సక్సెస్ అంటే పెద్ద ఇల్లు, గుర్తింపు కాదు, సమాజంలో గౌరవం పొందడమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) అన్నారు. విశాఖలో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GITAM Institute of Medical Sciences) స్నాతకోత్సవంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒకేసారి 4వేల మంది విద్యార్థులకు వైద్యవిద్య పట్టా, పతకాలు (Medals) ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ డబ్బు సౌకర్యం కల్పిస్తుందని, గౌరవాన్ని తెచ్చిపెట్టదని చెప్పారు. మనం చేసే పనికి సమాజంలో గౌరవం లభించడమే అసలైన సక్సెస్ (success) అని తెలిపారు. ప్రపంచాన్ని మార్చాలంటే రిస్క్ చేయకతప్పదన్నారు. మీకన్నా మీ వ్యక్తిత్వం గురించి అందరికీ ముందుగా తెలుస్తుంది. అందరూ మిమ్మల్ని గమనిస్తారు. ఫర్ఫెక్ట్ అనిపించుకోవాలనుకుంటే పర్ఫెక్ట్గా ఉండాల్సిందే అని అన్నారు.








