విజయవాడ దసరా మహోత్సవాలు.. మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు
మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికిన ఆలయ అధికారులు
ఉండవల్లి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దసరా మహోత్సవాలకు రావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసిన ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి లోకేష్ ను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించిన వారిలో దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్, బోర్డు సభ్యులు ఉన్నారు.








