Success Story: రూ. 5 వేల అప్పు దొరకలే.. కట్ చేస్తే నెలకు రూ. 50 వేలు.. సక్సెస్ అంటే ఇదే!
Success Story: చాలామంది వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడి ఉండాలని భావిస్తారు. కానీ, జార్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన నేహా కథ వింటే ఆ అభిప్రాయం మారుతుంది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సరైన ఉద్యోగం దొరకక, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించక ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కనీసం రూ. 5,000 అప్పు అడిగినా ఎవరూ ఇవ్వని ఆ కఠిన పరిస్థితుల్లో నేహా తనలోని కళా నైపుణ్యాన్ని నమ్ముకున్నారు.
ప్రభుత్వ అండతో కొత్త మలుపు:
అప్పు కోసం ఎదురుచూసి విసిగిపోయిన నేహా, పట్టుదలతో ప్రభుత్వం నుంచి రూ. 50 వేల రుణం పొందారు. ఆ మొత్తంతో వెదురుతో ఆభరణాలు, ఇతర వస్తువుల తయారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అప్పటివరకు కేవలం అలంకరణ వస్తువులకే పరిమితమైన వెదురును, ఆమె ఫ్యాషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చారు.
పర్యావరణ హితం.. కళాత్మక సొగసు
నేహా తయారు చేసే వెదురు ఆభరణాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమె దగ్గర దాదాపు 2,000 రకాలకు పైగా ఇయర్ రింగ్స్ (చెవిపోగులు) కలెక్షన్ ఉంది. వెదురుతో చేసిన నెక్లెస్‌లు, బ్రాస్లెట్లపై ఆమె స్వయంగా ఆర్గానిక్ పెయింటింగ్స్ వేస్తారు. ఈ రంగులు మసకబారవు, చర్మానికి ఎటువంటి హాని చేయవు. పర్యావరణ స్పృహ పెరిగిన నేటి కాలంలో ఈ రకమైన ‘ఎకో-ఫ్రెండ్లీ’ నగలకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
![]()
ఇవి కూడా చదవండి
రాంచీ నుంచి దేశవ్యాప్త గుర్తింపు:
కేవలం తన ఊరికే పరిమితం కాకుండా కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి వివిధ రాష్ట్రాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి తన ప్రతిభను చాటుకున్నారు నేహా. ప్రస్తుతం ఆమె నెలకు రూ. 50 వేలకు పైగా సంపాదిస్తూ తన కుటుంబాన్ని గౌరవంగా పోషిస్తున్నారు. వివాహాలు, వేడుకల కోసం ఆమె వద్దకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి.
వెదురు వాలి దీదీగా కీర్తి:
నేడు నేహాను అందరూ ఆత్మీయంగా ‘వెదురు వాలి దీదీ’ (Bamboo Wali Didi) అని పిలుచుకుంటున్నారు. నైపుణ్యానికి ఆత్మవిశ్వాసం తోడైతే, పెట్టుబడి లేకపోయినా విజయం సాధించవచ్చని నేహా నిరూపించారు. కేవలం తన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా, ఎంతోమంది మహిళలకు ఆమె ఒక రోల్ మోడల్‌గా నిలిచారు.
ఇవి కూడా చదవండి













