బే ఏరియాలో ఘనంగా భారత స్వాతంత్య్ర వేడుకలు.. ఉత్సాహంగా ఇండియన్ డే పరేడ్
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో అమెరికాలోని బే ఏరియాలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా ఇండిపెండెన్స్ డే పరేడ్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అత్యంత ఉత్సాహంగా పాల్గొంది. ప్రవాస భారతీయుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో తానా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.

ఈ వేడుకల్లో తానా తరఫున ప్రముఖులు శ్రీకాంత్ దొడ్డపనేని, వెంకట్ అడుసుమల్లి, రామ్ తోట తదితరులు ప్రత్యేకంగా పాల్గొని సందడి చేశారు. ఈ పరేడ్ సందర్భంగా తానా తన సువర్ణోత్సవ (50th Anniversary) ఘనతను, అలాగే ప్రవాసాంధ్ర పిల్లలకు తెలుగు భాషను నేర్పుతున్న ‘తానా పాఠశాల’ (Paatasala) విశిష్టతను ప్రతిబింబించేలా ప్రత్యేక శకటాలు , ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. అందరినీ ఆకట్టుకునేలా సాగిన ఈ ప్రదర్శనలు అమెరికాలో తెలుగు సంస్కృతిని, తానా సేవా కార్యక్రమాలను ఘనంగా చాటిచెప్పాయి.








