పార్లమెంటులో చట్టం చేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీకిరాని శాసనసభ్యుల జీతం వెనక్కి తీసుకునేలా పార్లమెంటు (Parliament)లో చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు శాసనసభ స్పీకర్ చింతకాలయ అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) తెలిపారు. దీనిపై తనకు ఇంకా సమాధానం రాలేదన్నారు. తునిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొద్దిరోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) హాజరు కావాలన్నారు. తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించి పరిస్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు జగన్ను గెలిపించారని చెప్పారు. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బయటే సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని తెలిపారు. తాము కొత్తగా తీసుకువచ్చిన విధానం ద్వారా అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటేనే ఆటోమేటిక్ కెమెరాలు (automatic cameras) ఆన్ అవుతాయని, అప్పుడే హాజరైనట్లు లెక్కలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 17న జరిగే బీఏసీ సమావేశం (BAC meeting)లో అసెంబ్లీ ఎన్నిరోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.








