శ్రేయస్ అయ్యర్ సెలక్షన్‌పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు..!
ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer), దేవదత్ పడిక్కల్ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ, వారికి టీమ్ ఇండియా టీ20 జట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమ్ ఇండియా లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫామ్‌లో ఉన్నంత మాత్రాన జట్టులోకి తీసుకోలేమని, దానికి గల కారణాలను కుండబద్దలు కొట్టినట్లు వివరించాడు. ప్రస్తుతం టీమ్ ఇండియా టీ20 జట్టులో విపరీతమైన పోటీ ఉందని పేర్కొన్నాడు.
ముఖ్యంగా టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav), హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వంటి ఆటగాళ్లు స్థిరంగా రాణిస్తుండటంతో, కొత్తగా లేదా తిరిగి జట్టులోకి వచ్చే వారికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాడు. కేవలం ఒక ఐపీఎల్(IPL) సీజన్ ప్రదర్శనతో సీనియర్లను పక్కన పెట్టడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ నైపుణ్యంపై సందేహం లేనప్పటికీ, టీ20 ఫార్మాట్‌కు కావాల్సిన మెరుపు వేగంతో కూడిన ఇన్నింగ్స్ ఆడటంలో ఆయన ఇంకా మెరుగుపడాలని సెహ్వాగ్ సూచించాడు.
ఆధునిక టీ20 క్రికెట్లో కేవలం పరుగులు చేయడం ముఖ్యం కాదని, అవి ఎంత వేగంగా వస్తున్నాయనేది సెలక్టర్లు గమనిస్తున్నారని ఆయన అన్నారు. పడిక్కల్ లాంటి యువ ఆటగాళ్లకు ఇంకా సమయం ఉందని, వారు తమ నిలకడను నిరూపించుకోవాలని సూచించాడు. సెలక్టర్లు ఇప్పుడు కేవలం ఫామ్ కంటే కూడా, జట్టు సమతుల్యత, భవిష్యత్తు అవసరాలను చూస్తున్నారని సెహ్వాగ్ విశ్లేషించాడు. ఐపీఎల్లో బాగా ఆడిన ప్రతి ఒక్కరినీ జట్టులోకి తీసుకోవడం సాధ్యం కాదని, ఇప్పటికే జట్టులో ఉన్నవారు విఫలమైతే తప్ప అయ్యర్ వంటి వారికి తలుపులు తెరుచుకోవని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








