సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..?
భారత క్రికెట్ జట్టులో మరో భారీ మార్పుకు రంగం సిద్ధమైందా..? 2026 టీ20 ప్రపంచకప్‌ను టీమ్ ఇండియాకు అందించిన సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) కెప్టెన్సీకి ముప్పు వాటిల్లిందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. టీ20 ఫార్మాట్లో సూర్య స్థానాన్ని భర్తీ చేసేందుకు స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ పేరును సెలెక్టర్లు ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో(IPL) శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన నాయకత్వ ప్రతిభను కనబరిచాడు.
2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను(DC) ఫైనల్‌కు నడిపించిన అయ్యర్.. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు (KKR) టైటిల్ అందించాడు. 2025 ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలబెట్టి తన ‘లీడర్షిప్’ సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సీజన్ లో టీంను ఓటములు లేకుండా నడిపిస్తున్నాడు అయ్యర్. టీ20 క్రికెట్లో నాల్గవ స్థానంలో అయ్యర్‌ను మించిన ఆప్షన్ ప్రస్తుతం లేదని సెలెక్టర్లు భావిస్తున్నారు. సూర్య నేతృత్వంలో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పటికీ, వ్యక్తిగతంగా అతని బ్యాటింగ్ ప్రదర్శన నిలకడగా లేదు.
ఇవి కూడా చదవండి
కెప్టెన్సీ ఒత్తిడి అతని సహజ సిద్ధమైన ఆటతీరుపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నాటికి సూర్య వయస్సు 38 ఏళ్లు నిండనుంది. ఆ సమయానికి జట్టును నడిపించేందుకు ఒక యువ నాయకుడు అవసరమని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యోచిస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియాలో మేజర్ మార్పులు చేయాలని చూస్తున్న బోర్డుకు, అయ్యర్ ఒక ‘లాంగ్ టర్మ్’ కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌కే తన మద్దతు తెలుపుతున్నాడు. 2028 టీ20 వరల్డ్ కప్ వరకు సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని గంభీర్ ఆశిస్తున్నాడు. అయితే, అగార్కర్ బృందం మాత్రం ‘యూత్ ఓవర్ ఎక్స్పీరియన్స్’ అనే ఫార్ములా వైపు మొగ్గు చూపుతోంది. జూన్-జూలైలో జరగనున్న ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటన సూర్య కెరీర్‌కు అగ్నిపరీక్షగా మారనుంది. అక్కడ అతని బ్యాటింగ్ ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఇవి కూడా చదవండి








