తీవ్రమైన క్యాలరీల లోపం వల్ల మెదడుకు అందాల్సిన ప్రధాన ఇంధనమైన గ్లూకోజ్ స్థాయిలు పడిపోయి, ఆలోచనా శక్తి మందగిస్తుంది.
సరిగ్గా తినకపోవడం వల్ల ఏకాగ్రత లోపించడం, చిన్న విషయాలను కూడా మర్చిపోవడం వంటి 'బ్రెయిన్ ఫాగ్' సమస్యలు మొదలవుతాయి.
అతి తక్కువ సమయంలో బరువు తగ్గాలని చూస్తే ఒత్తిడి హార్మోన్ (కోర్టిసోల్) పెరిగి, జ్ఞాపకశక్తి కేంద్రమైన హిప్పోకాంపస్‌ను దెబ్బతీస్తుంది.
డైటింగ్‌లో ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోతే, మెదడు సంకేతాలకు అవసరమైన డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాల ఉత్పత్తి తగ్గుతుంది.
వేగవంతమైన బరువు తగ్గుదలలో శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. ఇది మెదడు కణాల కమ్యూనికేషన్‌ను నెమ్మదింపజేస్తుంది.
విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం వంటి అవసరమైన సూక్ష్మపోషకాలు అందకపోవడం వల్ల కూడా తీవ్రమైన మతిమరుపు వచ్చే ఛాన్స్ ఉంది.
పరిశోధనల ప్రకారం.. 65 ఏళ్లు పైబడిన వారు హఠాత్తుగా బరువు తగ్గితే వారిలో మానసిక సామర్థ్యం (Cognitive Decline) వేగంగా క్షీణిస్తుంది.
వారానికి 0.5 నుండి 1 కేజీ బరువు తగ్గడం సురక్షితం. క్రష్ డైట్లు కాకుండా సమతుల్య ఆహారం, వ్యాయామంతో క్రమంగా బరువు తగ్గాలి.
అందమైన శరీరంతో పాటు చురుకైన మెదడు కూడా ముఖ్యం. కాబట్టి పోషకాలు ఉన్న ఆహారం తింటూ ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గండి!