ఆరోగ్య సేతు 2.0 యాప్ ఆవిష్కరణ… దీని స్పెషల్ ఇదే…
ఆరోగ్య సేతు 2.0 యాప్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. కరోనా కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు కాంటాక్ట్ ట్రేసింగ్, ఆరోగ్య హెచ్చరికలు అందించేందుకు రూపొందించిన ఆరోగ్య సేతు (Aarogya Setu) యాప్ ఇప్పుడు పూర్తిస్థాయి డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెందింది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద దీనిని ఆరోగ్య సేతు 2.0గా అధికారికంగా ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆరోగ్య సేతు 2.0 ప్రతి పౌరుడికి ఆరోగ్య సేవల కోసం ఉపయోగపడే ఒకే డిజిటల్ ప్రవేశ ద్వారం (Single Digital Gateway)గా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో డిజిటల్ హెల్త్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు.
ఇకపై ఇది కేవలం కోవిడ్‌కు సంబంధించిన యాప్ మాత్రమే కాకుండా, ప్రతి భారతీయుడికి వ్యక్తిగత డిజిటల్ ఆరోగ్య సేవలను ఒకే వేదికపై అందించే సమగ్ర హెల్త్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేయనుంది. ఆసుపత్రి సేవలు పొందడం నుంచి వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు నిర్వహించడం, బీమా వివరాలు తెలుసుకోవడం వరకు అనేక సేవలను ఒకే యాప్‌లో అందుబాటులోకి తీసుకురావడం ఈ కొత్త వెర్షన్ ప్రత్యేకత.
ఆరోగ్య సేతు 2.0 స్పెషల్ ఇదే…
దేశ ప్రలకు మరింత సులభమైన డిజిటల్ ఆరోగ్య సేవలను అందించేందుకు ఈ యాప్ రూపొందించారు. దీనిని జాతీయ ఆరోగ్య యాప్ గా ప్రకటించారు. ఈ యాప్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన అనేక సేవలను ఒకే వేదికపై పొందే అవకాశం కల్పించారు.ఇకపై వేర్వేరు యాప్ లను డౌన్ లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. హెల్త్ కార్డులు, చికిత్స వివరాలు, బీమా సమాచారం, ఆస్పత్రి సేవలు… అలా అనేక సౌకర్యానలు ఒకే యాప్ లో వినియోగించుకోవచ్చు.
అలాగే ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ను సృష్టించుకోవచ్చు. అలాగే డిజిటల్ హెల్త్ రికార్డులను భద్రపరుచుకోవడంతో పాటు, ఆస్పత్రుల్లో స్కాన్, షేర్ అనే ఫీచర్ ద్వారా పేపర్ లెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా మరింత ఉపయోగపడేలా ఇప్పుడు ముందుకు తెచ్చారు.
ఆరోగ్య సేతు 2.0 అందుబాటులో వున్న కొత్త ఫీచర్లు
ABHA ఖాతా తెరుచుకోవడం, నిర్వహించుకోవడం
AI సహాయంతో ప్రిస్కిప్షన్లు, ల్యాబ్ రిపోర్టులు, వైద్య పత్రాలను డిజిటల్ రికార్డులుగా మార్చుకోవడం.
ఒకే చోట పూర్తి హెల్త్ టెస్ట్ హిస్టరీని చూపించే హెల్త్ డ్యాష్ బోర్డు కూడా ఇందులో వుంది.
స్మార్ట్ వాచీలు, ఫిట్ నెస్ బ్యాండ్లతో సింక్ అయి హార్ట్ రేట్, స్టెప్స్, కేలరీలు, గ్లూకోజ్ వంటి ఆరోగ్య సమాచారాన్ని ట్రాక్ చేసే సదుపాయం కూడా వుంది.
మందులు వేసుకునే సమయాన్ని కూడా గుర్తు చేసే రిమైండర్ ఇందులో వుంది.
ఆస్పత్రుల్లో OPD అపాయింట్ మెంట్ బుకింగ్ ను వేగంగా పూర్తి చేసే సౌకర్యం కూడా వుంది.








