Telugu people: తెలుగు వారిని స్వదేశానికి చేర్చే ప్రక్రియ వేగవంతం
గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన తెలుగు వారిని (Telugu people) స్వదేశానికి చేర్చే ప్రక్రియ వేగవంతం చేసినట్లు ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. బహ్రెయిన్‌లో ఉన్న తెలుగు వారిని ప్రత్యేకంగా హైదరాబాద్ (Hyderabad) కు తరలించేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. గల్ఫ్ ఎయిర్ సంస్థతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. బహ్రెయిన్‌లో (Bahrain) ఇంకా 400 మందికి పైగా తెలుగు వారు స్వదేశానికి వచ్చేందుకు వేచి ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో పాటు విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాల సహకారం తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) దష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గత మూడు రోజుల్లో సుమారు మూడు వందల మంది తెలుగు వారిని బహ్రెయిన్ నుంచి తరలించామని అధికారులు చెప్పారు. ఏపీ ఎనఆర్టీ ప్రతినిధుల సహకారంతో వీరందరూ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి








