ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల (Panchayat Elections)కు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని విడుదల చేసింది. ఈ నెల 17న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు (Nominations) స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహకరణకు ఈ నెల 21న తుదిగడువు. ఈ నెల 26న పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ (Polling) జరగనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రీపోలింగ్ (Repolling) అవసరమైతే ఈ నెల 27న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం మూడు విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.







