Davos: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈడి ఉక్ చాంగ్ తో మంత్రి లోకేష్ భేటీ
ఎపి వర్సిటీలతో కలసి పరిశోధన కార్యక్రమాలకు సహకరించండి
దావోస్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మాథ్యూ ఉక్ చాంగ్ (Matthew Uk Chang) తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాలతో కలసి పరిశోధనా కార్యక్రమాలకు సహకరించండి. వ్యవసాయం, బయోటెక్నాలజీ, ఇతర స్థిరమైన పద్ధతులకు సంబంధించిన ప్రాజెక్టులపై సహకారం అందించండి. ఎపి విశ్వవిద్యాలయాలతో కలసి రాష్ట్రంలో ఉమ్మడి పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేయండి. స్థానిక పరిశోధకులు, విద్యార్థుల కోసం సింథటిక్ బయాలజీలో శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహించండి. స్థానిక బయోటెక్ కంపెనీలు, NCEB భాగస్వామి నెట్వర్క్ మధ్య సహకారాన్ని సులభతరం చేయండి. AP మెడ్‌టెక్ జోన్‌కు సమీపంలోఇన్నొవేషన్ హబ్, R&D క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి నాలెడ్జ్ సపోర్ట్ అందించాలని మంత్రి లోకేష్ కోరారు.
ప్రపంచవ్యాప్తంగా బయోఇంజనీరింగ్ అనుసంధానించే గ్లోబల్ బయోఫౌండ్రీ అలయెన్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఇంపీరియల్ కాలేజి ఆఫ్ లండన్, ఇంజనీరింగ్ బయాలజీ రీసెర్చి కన్సార్టియం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీలతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఉక్ చాంగ్ తెలిపారు.













