Minister Lokesh: ఎవరెన్ని కుట్రలు పన్నినా ఏపీ అభివృద్ధి ఆగదు : మంత్రి లోకేశ్
అభివృద్ధి వ్యతిరేక రాజకీయాలకు జగన్ మరోసారి తెరలేపారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ మొదట అమరావతి (Amaravati)ని వ్యతిరేకించారన్నారు. తర్వాత విద్యుత్ ఒప్పందాలను రద్దు చేశారని తెలిపారు. ఉద్యోగాలు సృష్టించే ఐటీ అభివృద్ధి కేంద్రాలపై పిటిషన్లు వేశారని మండిపడ్డారు. విశాఖ గూగుల్ ఏఐ హబ్ (AI Hub) పైనా కోర్టును ఆశ్రయించిందన్నారు. జగన్ కు ఏపీ యువత, రాష్ట్ర అభివృద్ధి పై విద్వేషం ఎందుకుని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి

(adsbygoogle = window.adsbygoogle || []).push({});








