Anantapur : ఇలా కూడా కంప్లైంట్ చేస్తారా? మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు.. తరువాత ఏమైందంటే?
Tadipatri: సాధారణంగా కూరగాయలు బాగోలేదని లేదా వస్తువులు నాసిరకంగా ఉన్నాయని విక్రేతలతో గొడవ పడటం చూస్తుంటాం. కానీ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక వ్యక్తి ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. తాను తెచ్చిన మటన్ (తలకాయ కూర) ఎన్ని విజిల్స్ వచ్చినా ఉడకడం లేదని, తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏం జరిగిందంటే:
తాడిపత్రికి చెందిన ఒక వ్యక్తి స్థానిక మార్కెట్లో మటన్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లాక కుక్కర్లో పెట్టి ఏకంగా 20 విజిల్స్ వేయించినా ఆ మాంసం అస్సలు ఉడకలేదు.
ఇవి కూడా చదవండి
పోలీస్ స్టేషన్‌కు పరుగులు: దీంతో సదరు వ్యక్తికి కోపం రావడమే కాకుండా, తనను మోసం చేసి ‘ముదురు మాంసం’ లేదా నాసిరకం మాంసం అమ్మారని భావించాడు. వెంటనే ఆ మాంసాన్ని తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
ఫిర్యాదు: మటన్ షాపు యజమాని తనను మోసం చేశాడని, ఉడకని మాంసం అమ్మి తన డబ్బులు, సమయం వృధా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసుల స్పందన: ఈ వింత ఫిర్యాదు చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పోలీస్ స్టేషన్‌కు రావడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ ‘మటన్ ముచ్చట’ తాడిపత్రిలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ మాంసం ఉడకకపోవడానికి కారణం అది ‘ముదురు మాంసం’ కావడమా లేక మరేదైనా కారణమా అని నెటిజన్లు సరదాగా చర్చించుకుంటున్నారు.








