నిజాలు బయటకొస్తున్నాయనే డైవర్షన్ పాలిటిక్స్ : మంత్రి సత్యప్రసాద్
వివేకానందరెడ్డి (Vivekananda Reddy) హత్యతో అంతిమంగా లబ్ధి పొందింది జగనేనని, కేసు దర్యాప్తును ఈడీ, సీబీఐ(CBI) ముమ్మరం చేయడంతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి చెప్పిన నిజాలు, తాజాగా నిందితుడు సునీల్‌యాదవ్(Sunil Yadav) వెల్లడించిన వాస్తవాలు, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు, నేరుగా తాడేపల్లి ప్యాలెస్వైపే వెలేత్తి చూపుతున్నాయని చెప్పారు. వివేకా హత్యకేసులో నిజాలు ఒక్కొక్కటిగా నిగ్గు తేలుతున్నాయి. జగన్ (Jagan)తోపాటు ఆయన కుటుంబసభ్యుల పాత్రపై ఈడీ (ED) విచారణలో ఆధారాలు బయటకొస్తున్నందునే ప్రజల దృష్టి మళ్లించేందుకు డీఎస్సీ, ఇతర అంశాలపై డ్రామాలాడుతున్నారు అని ధ్వజమెత్తారు.
సొంత బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే గుండెపోటుగా చిత్రీకరించిన చరిత్ర జగన్‌ది కాదా? అప్పట్లో చంద్రబాబుపై నెపం నెట్టాలని చూసినట్లే, ఇప్పుడూ ప్రతి అంశంలోనూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వివేకా హత్యకేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటే ఐదేళ్లపాటు ఆ కుటుంబాలు తీవ్ర భయాందోళనతో గడిపాయి అని అన్నారు. బాబాయ్, తల్లి, చెల్లి ఇలా ఎవరినైనా అధికారం కోసం వాడుకోవడమే జగన్‌కు తెలుసు అని మండిపడ్డారు.








