సీఎం రేవంత్ క్షమాపణ ఎందుకు చెప్పాలి: మహేశ్ కుమార్ గౌడ్
దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. ఇరు దైవాల రూపాల మధ్య వ్యత్యాసం చెప్పడం తప్పా? క్షమాపణ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. గాంధీభవన్ (Gandhi Bhavan)లో మీడియా ప్రతినిధులు సీఎం వ్యాఖ్యలను ప్రస్తావించగా మహేశ్ కుమార్ స్పందించారు. రాముడు, శివుడి రూపాల స్వరూపాన్ని ఉదాహరణగా చూపుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. అయినా శ్రీరాముడు (Sriramudu) ఎన్నో ఆభరణాలు ధరించి ధనవంతుడిలా కనిపిస్తారు. అదే శివుడు ఎలాంటి ఆభరణాలు, హంగులు లేకుండా పులి చర్మంతో భిన్నమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మాకు ఇద్దరు దేవుళ్లపై అపారమైన గౌరవం, భక్తి ఉన్నాయి అని పేర్కొన్నారు.








