స్ట్రాత్ ఫీల్డ్ మేయర్‌గా తెలుగు మహిళ
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ తెలుగు మహిళ అరుదైన ఘనత సాధించారు. అత్యంత కీలకమైన స్ట్రాత్‌ఫీల్డ్ (Strathfield) పురపాలక సంఘం మేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన కర్రి సంధ్యారెడ్డి (Sandhya Reddy) (శాండీ రెడ్డి) ఎన్నికయ్యారు. కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. మేయర్‌గా సంధ్యారెడ్డి సెప్టెంబర్ 2028 వరకు పదవిలో కొనసాగుతారు.
ఇవి కూడా చదవండి
సంధ్యారెడ్డి స్టాన్లీ కళాశాలలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తిచేశారు. 1991లో వివాహం అనంతరం భర్త కర్రిరెడ్డితో కలిసి ఆస్ట్రేలియా (Australia)కు వలస వెళ్లి, అక్కడ ఇమిగ్రేషన్ న్యాయవాదిగా స్థిరపడ్డారు. 2021లో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌గా ఎన్నికై, 2023లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy)కి సంధ్యారెడ్డి బంధువు. ఈ విజయంతో తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాలో మేయర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.








