పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
తెలంగాణలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అభ్యర్థుల ను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి (Ramreddy Sarvotham Reddy), మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి (Sama Rammohan Reddy)లను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఆమోదంతో వీరిద్దరినీ ఎంపిక చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ( KC Venugopal) ప్రకటనను విడుదల చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సామ రామ్మోహన్‌రెడ్డి గతంలో తెలంగాణ కాంగ్రెస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగం ఛైర్మన్‌గా పనిచేశారు.








