NC25 క్లారిటీ ఇచ్చిన చైతన్య టీమ్
నాగచైతన్య(naga chaitanya) నెక్ట్స్ మూవీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ప్రస్తుతం బ్రేక్ పడింది. తాత్కాలికంగా NC25గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ క్లాక్స్(Clarx)తో చైతన్య సినిమా చేయనున్నాడని, ఈ సినిమాతో సాత్విక వీరవల్లి(satwika veeravalli) హీరోయిన్గా పరిచయం కానుందని ప్రచారం జరిగింది. అయితే ఈ వివరాలపై ఇప్పటివరకు అఫీషియల్ క్లారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో నాగచైతన్య టీమ్ స్పందిస్తూ ఫ్యాన్స్, మీడియా వర్గాలు ఎలాంటి నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. NC25కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు, రూమర్స్‌ను ప్రచారం చేయవద్దని స్పష్టం చేసింది. సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి ఉండటం సహజమేనని పేర్కొంటూనే, ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ వివరాలనైనా అధికారిక మార్గాల్లో వెల్లడించిన తర్వాతే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
దీంతో NC25 డైరెక్టర్, హీరోయిన్, కథాంశం వంటి అంశాలపై ఇప్పటివరకు చక్కర్లు కొడుతున్న వార్తలకు అధికారిక ముద్ర పడలేదు. దీంతో ఈ సినిమా విషయంలో అసలు కాంబినేషన్ ఏంటనే ఆసక్తి కొనసాగుతోంది. మరోవైపు నాగచైతన్య నటించిన వృషకం(Vrushaka) డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత NC25పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.








