డ్రాగన్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్(Dragon) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్కు తాజాగా క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ డేట్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే మేకర్స్ డెసిషన్ కొనసాగుతోంది.
డ్రాగన్ ను 2027 జూన్ 11న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే షూటింగ్ షెడ్యూల్స్, నిర్మాణ పనుల నేపథ్యంలో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల పలు ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాత మైత్రీ రవిశంకర్(Ravi shankar) చేసిన తాజా కామెంట్స్ ఈ ఊహాగానాలకు తెరదించాయి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్(Dont trouble the trouble) ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ డ్రాగన్(Dragon) జూన్ 11న రావడం ఖాయమని స్పష్టం చేశారు.
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో నెలకొన్న రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్కు క్లారిటీ వచ్చినట్టైంది. ప్రశాంత్ నీల్(Prasanth Neel) మార్క్ యాక్షన్ ట్రీట్మెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడంతో ఇక సినిమా నుంచి రాబోయే అప్డేట్స్పై ఆసక్తి మరింత పెరగనుంది.








