ఎమోషనల్ గా సాగిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్
హైదరాబాద్‌లో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్(Dont Trouble the trouble) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సినిమాతో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) కొడుకు ఎస్.ఎస్. కార్తికేయ(SS Karthikeya) నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు శశాంక్ యేలేటి(shashank yeleti) దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) చీఫ్ గెస్టుగా హాజరు కావడంతో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.
రాజమౌళి ఫ్యామిలీతో ఎన్టీఆర్‌కు ఉన్న బాండింగ్ ఈ ఈవెంట్ లో మరోసారి కనిపించింది. ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) నుంచి రాజమౌళి, కార్తికేయ వరకు ప్రతి ఒక్కరూ తమ సినీ జర్నీలోని అనుభవాలను గుర్తుచేసుకోవడంతో ఈవెంట్లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో తాను కథపై బలంగా నమ్మకం ఉంచానని రాజమౌళి తెలిపారు. కథ నచ్చడంతో టీమ్‌ను ముందుకు వెళ్లమని ప్రోత్సహించానని, అయితే నిర్మాణంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇక ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్‌పై చిత్రబృందం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. యూత్ కలిసి రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌పై మేకర్స్ లో ఉన్న నమ్మకం ఈవెంట్ లో స్పష్టంగా కనిపించింది. రాజమౌళి ఫ్యామిలీకి చెందిన పలువురు ఒకే వేదికపై కనిపించడం, ఎన్టీఆర్‌తో వారి అనుబంధం మరోసారి గుర్తుకురావడం ఈ ఈవెంట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. భారీ అంచనాల మధ్య డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.








