కొచ్చిలో నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
కొచ్చిలో తెలుగు పరిమళం
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
కేరళం రాష్ట్రం కొచ్చిలో తెలుగువారి ఆప్యాయత, అభిమానం వెల్లివిరిసాయి. రేపు కొచ్చిలో జరగనున్న ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అందరినీ ఆత్మీయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్.. ఏ ప్రాంతం నుంచి, ఎప్పుడు, ఇక్కడకు వచ్చారు? ఇక్కడ ఏం చేస్తుంటారు? అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు ప్రజలు చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.








