నానితో మీనాక్షి రొమాన్స్?
ది ప్యారడైజ్(the paradise) తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటున్న నేచురల్ స్టార్ నాని(nani), తన తర్వాతి ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టారు. సాహో(Saaho) ఫేమ్ సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న బ్లడీ రోమియో(bloddy romeo)పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బ్లడీ రోమియోలో నాని గత సినిమాలతో పోలిస్తే పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. కథకు కీలకమైన క్యారెక్టర్ లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) నటించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సినిమాలోని కీలక సీన్స్ ను లండన్‌లో షూట్ చేసేందుకు డైరెక్టర్ సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యాక్షన్‌తో పాటు స్టైలిష్ ట్రీట్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నాని వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్(niharika entertainments banner)పై ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ పై త్వరలోనే అఫీషియల్ వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను ప్రవీణ్ లక్కరాజు(praveen lakkaraju) నిర్వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి 2027 సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.








