ఎన్టీఆర్ మూవీపై త్రివిక్రమ్ క్లారిటీ
ఎన్టీఆర్(NTR)- త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్‌పై వస్తున్న అప్డేట్స్కు తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వెంకటేష్‌తో తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam) ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయనను ఎన్టీఆర్‌తో చేయబోయే తర్వాతి సినిమా గురించి ప్రశ్నించగా.. కథకు సంబంధించిన వర్క్స్ పూర్తయ్యాయని వెల్లడించారు. అయితే టైటిల్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని తెలిపారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై నెలకొన్న ఆసక్తి మరింత పెరిగింది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prasanth neel) దర్శకత్వంలో డ్రాగన్(Dragon) షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసే అవకాశముంది. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ కోసం ఆయన రెడీ కానున్నారు. ఈ సినిమాను మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. భారీ స్థాయిలో నిర్మాణ విలువలు ఉండనున్న ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్లో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ఆదర్శ కుటుంబం రిలీజైన తర్వాత త్రివిక్రమ్ పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్(harika haasinee creations) బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు దశలవారీగా వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం టైటిల్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2028లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.








