టాక్ షో కోసం మెగాస్టార్ కు అంత రెమ్యూనరేషనా?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) కోసం చిరంజీవితో స్పెషల్ సెలబ్రిటీ టాక్ షో నిర్వహించే దిశగా డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై ఇరువర్గాల మధ్య సంప్రదింపులు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ షో కోసం చిరంజీవికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ.200 కోట్ల రెమ్యూనరేషన్ అంటూ వినిపిస్తున్న ఈ మొత్తం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna)తో అన్‌స్టాపబుల్(Unstoppable) వంటి సక్సెస్ఫుల్ టాక్ షోకు కాన్సెప్ట్ అందించిన బీవీఎస్ రవి ఈ కొత్త టాక్ షో రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమా, పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు, సినీ జర్నీ వంటి అంశాలను కలిపి ఈ షోను ప్రత్యేకంగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు నెట్‌ఫ్లిక్స్‌తో జరుగుతున్న డిస్కషన్స్ లో చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత కొణిదెల కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి బాబీ(bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా(Kaaka) షూటింగ్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి 2027 రిలీజ్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత టాక్ షో వర్క్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి విశ్వంభర(Vishwambhara) సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారని సమాచారం.








