రైల్వే వ్యవస్థలో కొత్త సిస్టమ్.. LNG రైలు ప్రత్యేకత ఇదే..
భారతీయ రైల్వేలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. డీజిల్ పై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో తొలిసారిగా లిక్విడ్ నేచురల్ గ్యాస్ (LNG) ఆధారిత డ్యూయల్ ఫ్యూయల్ రైలు ప్రారంభమైంది. దీనిని హోం మంత్రి అమిత్ షా సబర్మతి రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు.
అయితే… ఇది పూర్తిగా LNG తోనే నడిచే రైలు కాదు. ఇందులో డీజిల్ కూడా వుంటుంది. అంటే డ్యూయల్ ఫ్యూయల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. అవసరాన్ని బట్టి ఇంజిన్ రెండు ఇంధనాలతో పనిచేస్తుంది. సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలోని రెండు డ్రైవింగ్ పవర్ కార్లను ఈ టెక్నాలజీకి అనుగుణంగా మార్చారు. ఒక్కో పవర్ కార్ సామర్థ్యం 1,400 HP వుంటుంది.
పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపులో భాగంగా వేగంగా అడుగులు వేస్తోంది. రెండు నెలల క్రితం దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించుకోగా.. తాజాగా ఆ ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత ట్రైన్ల జాబితాలో ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) రైలు వచ్చి చేరింది.లభ్యతను బట్టి ఇంజిన్ స్వయంచాలకంగా ఇంధనాన్ని మార్చుకోగలదు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఎల్ఎన్జీ-డీజిల్ డెమూ రైలు సబర్మతి నుంచి మహేసన జంక్షన్ వరకు నడిచింది. ఇది 8 కోచ్‌లు కలిగిన నాన్-ఏసీ చైర్ కారు రైలు.
సబర్మతి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ డిపోలోని 1400 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్ పవర్ కార్లను(డీపీసీ) ఎల్ఎల్జీ డ్యూయల్ ఇంధన వ్యవస్థను అనుగుణంగా మార్పులు చేశారు. దీని ద్వారా సాంప్రదాయ డీజిల్ వాడకాన్ని 40ు వరకూ తగ్గించొచ్చని అంచనా. ప్రతి డీపీసీ డ్యూయల్ ఫ్యూయల్ ఇంజిన్‌లో 2200 లీటర్ల సామర్థ్యం కలిగిన ఎల్ఎన్జీ ట్యాంకును ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 950 నుంచి వెయ్యి కిలోగ్రాముల వరకూ ఎల్ఎన్జీని నిల్వ చేయవచ్చు. ఒక డీపీసీ ఇంజిన్ ట్యాంక్‌లో ఎల్ఎన్జీని పూర్తిగా నింపినప్పుడు.. అది సుమారు 444కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. హైడ్రోజన్, ఎల్ఎన్జీ రైళ్లలో వేర్వేరు ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలను ఉపయోగించారు. హైడ్రోజన్ రైలు నడుస్తున్న సమయంలో హైడ్రోజన్, ఆక్సిజన్‌ను వినియోగించి ఫ్యూయల్-సెల్ వ్యవస్థ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుంది. ఇది నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ఎల్ఎన్జీ రైలు డ్యూయల్ ఫ్యూయల్ ఎల్ఎన్జీ-డీజిల్ వ్యవస్థకు అనుగుణంగా మార్చిన ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది.








