తండ్రితో ప్రాజెక్టును వద్దన్న కొడుకులు
టాలీవుడ్ కింగ్ నాగార్జున(nagarjuna) కెరీర్లో 100వ సినిమా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా కాలంగా కథల ఎంపికపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సోగ్గాడే చిన్ని నాయనా(soggade chinni nayana), బంగార్రాజు(bangarraju) సినిమాల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల(kalyan krishna Kurasala)తో మరోసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచన వచ్చింది. కళ్యాణ్ కృష్ణ కూడా దాదాపు ఏడాదికి పైగా ఈ కథపై వర్క్ చేసి నాగార్జునను మెప్పించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో నాగార్జునతో పాటు ఆయన కొడుకులు నాగ చైతన్య(naga chaitanya), అఖిల్(akhil) కూడా భాగం కావాలనే ఆలోచన అప్పట్లో డిస్కషన్ కు వచ్చింది.
అయితే కథ విషయంలో అక్కినేని వారసుల నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి రాకపోవడం ప్రాజెక్ట్‌ను కీలక మలుపు తిప్పినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ స్క్రిప్ట్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు ఈ కథ తమకు సరైన ఎంపిక కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంతకాలం డిస్కషన్స్ కొనసాగిన తర్వాత నాగార్జున కూడా వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు టాక్. దీంతో నాగార్జున 100వ సినిమా కోసం మరో కథ వైపు వెళ్లారు.
ప్రస్తుతం డైరెక్టర్ రా కార్తిక్(Ra. karthik)తో చేస్తున్న సినిమాను నాగార్జున తన 100వ సినిమాగా తీసుకొచ్చే డెసిషన్ తీసుకున్నారు. కింగ్100(King100) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నాగ చైతన్య వృషకర్మ(Vrusha karma)ను పూర్తి చేసే పనిలో ఉండగా, అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.








