వీకెండ్ లోనూ తగ్గని ప్యారడైజ్ జోరు
నాని(nani), శ్రీకాంత్ ఓదెల(srikanth odela) కాంబినేషన్లో తెరకెక్కిన ది ప్యారడైజ్(The paradise) పై మొదటి వీకెండ్ తర్వాత కూడా ఆసక్తి కొనసాగుతోంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ యాక్షన్ డ్రామాకు తొలి రోజుల్లో వచ్చిన రెస్పాన్స్ మిక్డ్స్ గా ఉన్నప్పటికీ, ముఖ్యంగా తెలంగాణలో బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్లో పెద్దగా డ్రాప్ కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. సోమవారం కూడా థియేటర్లకు ప్రేక్షకుల రాక కొనసాగడం సినిమాకు కలిసొచ్చే అంశంగా నిలిచింది.
బుక్ మై షో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫామ్‌లలో సోమవారం ఒక్కరోజే 1.13 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం సినిమా డిమాండ్‌ను సూచిస్తోంది. హైదరాబాద్‌తో పాటు నైజాం పరిధిలోని పలు సెంటర్లలో ఫస్ట్, సెకండ్ షోలకు ఆక్యుపెన్సీ గణనీయంగా నమోదైనట్లు తెలుస్తోంది. సాధారణంగా వీక్‌డేస్‌లో ఆడియన్స్ నెంబర్ తగ్గే పరిస్థితుల్లోనూ ఈ స్థాయి బుకింగ్స్ నమోదవడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ థియేటర్లలో ఆక్యుపెన్సీ స్థిరంగా కొనసాగుతున్నట్లు సమాచారం. వీకెండ్ తర్వాత సోమవారం కూడా సినిమా తన థియేట్రికల్ రన్లో వేగాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది. రానున్న రోజుల్లో ఇదే స్థాయిలో ఆడియన్స్ రెస్పాన్స్ కంటిన్యూ అయితే, ది ప్యారడైజ్ కలెక్షన్లపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది.








