జ్యోతి సురేఖకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు
ఆసియా భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy), శాప్ చైర్మన్ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్లో చైనా (China)ను 238-234తో ఓడించి స్వర్ణం సాధించిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. భారత మహిళల ఆర్చరీ జట్టు అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణమన్నారు. రాష్ట్రానికి చెందిన వెన్నం జ్యోతి సురేఖ( Jyothi Surekha) 2023, 2026 ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించడంపై ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ వేదికపై వరుస విజయాలతో జ్యోతి సురేఖ భారత క్రీడా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారని రాంప్రసాద్ రెడ్డి, రవినాయుడు(Ravi Naidu) కొనియాడారు. భవిష్యత్ పోటీల్లోనూ భారత క్రీడాకారులు మర్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.








