దీనికి కర్త, కర్మ, క్రియ రాజ్ కెసిరెడ్డే : విజయసాయిరెడ్డి
ప్రజలపై వైసీపీ నేతలది బూటకపు ప్రేమ అని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) అన్నారు. మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని, దీనికి కర్త, కర్మ, క్రియ రాజ్ కెసిరెడ్డే (Raj Kesireddy)నని చెప్పారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ త్వరలో పార్టీ పేరును ప్రకటిస్తానని, ఆ తర్వాత పాదయాత్ర చేస్తానన్నారు. సజ్జల రాకమృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వల్లే వైసీపీకి నష్టం జరుగుతోందన్నారు. జగన్ (Jagan) వద్ద నన్ను దుర్మార్గుడిగా చిత్రీకరించిన వ్యక్తి ఆయనేనని విమర్శించారు. రాజధాని అమరావతి (Amaravati)కి తాను వ్యతిరేకం కాదన్నారు. విశాఖను రాజధానిగా చేస్తానని చెప్పి వైసీపీ మాట మార్చింది. నాడు విశాఖ రాజధాని అని చెప్పినవాళ్లు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తామని మాట తప్పిన వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ పార్టీ హయంలో నేను కీలకపాత్ర పోషించాననేది అవాస్తవం. అధికారంలోకి వచ్చేంతవరకు వైసీపీ నన్ను వాడుకుంది. నాపై కుట్రలు, దుష్ప్రచారం చేశారు. మÖడు నెలల్లో నన్ను పక్కనపెట్టారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీని ప్రస్తుత ఇన్ఛార్జ్ గెలిపించగలరా? మధ్యం కుంభకోణం కేసులో నాకు తెలిసిందంతా అధికారులకు చెప్పాను అని తెలిపారు.








