ఘనంగా ఒంగోలు 150 ఏళ్ల వేడుకలు
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ఒంగోలు 150 ఏళ్ల వేడుకలు(Ongole 150th Anniversary Celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు పురపాలక సంఘంగా ఆవిర్బవించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నగర కీర్తిని భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించారు. మినీ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్సవాల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu), ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు (Kambhampati Haribabu), మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డీఎస్బీవీ స్వామి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Sreenivasulu Reddy) ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఒంగోలు కీర్తిని అతిథులు, ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.








