Chandrababu: శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపే తీర్మానంపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
• కృష్ణా- గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పాలించారు
• బ్రిటిష్ మ్యూజియంలో అమరావతి గ్యాలరీ కూడా ఉంది. ఆనాటి చరిత్రను అక్కడ భద్రపరిచారు
• అంతటి ప్రాచీన, ఘన చరిత్ర తెలుగు జాతిది. సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగునేల ఇది
• బ్రిటిష్ వారు వచ్చాక పరిస్థితులు మారాయి. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రాభవం కోల్పోయాం
• ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులు అనే పేరు మనకు వచ్చింది.
• పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించింది.
• మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్ కు రాజధాని మారింది. ఇప్పుడు అమరావతికి మార్చుకున్నాం
• రాజధానులు కోల్పోవటం విమర్శలు, వివక్షత, అవమానాలు భరిస్తూనే వచ్చాం
• 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయి
• మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళం
• 1991లో ఆర్ధిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాం. 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం
• ఐటీ రివల్యూషన్ ను ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గా అందిపుచ్చుకున్నాం.
ఇవి కూడా చదవండి
• అప్పుడు చేసిన విజన్ కారణంగా రూ.1.05 లక్షల కోట్లు రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తోంది
• సైబరాబాద్‌ను ఇటుకా ఇటుకా పేర్చి నిర్మాణం చేశాం. ఫలితాలు వచ్చాయి. అందుకే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నిలిచింది
• విభజన సమయంలో సమన్యాయం చేయాలని కోరాను.
• ఇప్పుటి వైసీపీ నాయకుడు నాడు పార్లమెంటులో ఉండి కెమెరాలు నుంచి తప్పించుకు తిరిగాడు.
• 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కానీ, త్వరితగతిన సొంత రాజధాని నిర్మాణం చేయాలని ఇక్కడికి వచ్చాం
• 9 నెలల్లో ఈ అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నాం.
• సింగపూర్ సహకారంతో ఆ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు ఇవ్వాలని కోరాం
• ముందు దేశం బాగుండాలి, అలా ఉండాలంటే మన జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి
• తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే నా సంకల్పం కూడా
• విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని పెట్టాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది
• అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం
• ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పాడు. కానీ రోజుకో మాట ఊసరవెల్లి రాజకీయాలు చేశాడు
• టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేశాడు
• వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చు
• రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించాను
• ఈ ప్రాంతాంలోని రైతులను సంప్రదించి 58 రోజుల్లో 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇచ్చేశారు
• రాజధానికి రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
• రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు వక్తులు తోటలకు నిప్పు పెట్టారు. ప్రపంచ బ్యాంకుకు ఈమెయిళ్లు పెట్టారు.
• కానీ పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుంది.
ఇవి కూడా చదవండి








