AP Assembly: అమరావతిపై ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరావతిని(Amaravati) ఏపీ ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ ప్రభుత్వం అధికారికంగా తీర్మానం చేయనుంది. అసెంబ్లీలో ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది. అమరావతిని రాజధానిగా గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని, చట్టపరమైన చిక్కులు లేకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనుంది.
కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడితే, గత కొన్నేళ్లుగా సాగుతున్న రాజధాని సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడనుంది. రాజధాని అభివృద్ధికి కేంద్ర నిధులు, చట్టబద్ధత సాధించడం చంద్రబాబు(Chandrababu Naidu) సర్కార్ లక్ష్యంగా కనపడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల(Parliament session) నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ చేసే ఈ తీర్మానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రం పంపే ఈ ప్రతిపాదన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అమరావతి రాజధానిపై ఒక స్పష్టమైన, తుది ప్రకటన చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
అమరావతి రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించి, రాష్ట్ర భవిష్యత్తుపై కూడా క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావాలన్నా, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాలన్నా కేంద్ర ప్రభుత్వ అధికారిక గుర్తింపు, మద్దతు అత్యంత అవసరం. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పట్టాలెక్కించేందుకు దోహదపడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక కేంద్రం ఆమోదం తెలిపితే మాత్రం.. రాజకీయంగా కూడా చంద్రబాబు సర్కార్ కు ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి








