Law School: అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ
ప్రజా రాజధాని అమరావతి (Amaravati)లో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ (International Law School)ఏర్పాటుకు కీలక అడుగు పడింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) – పెరల్ ఫస్ట్ ఆధ్యరంలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐయూఎల్ఈఆర్) స్థాపనకు ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మందడం రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌రిజిస్ట్రార్ సీహెచ్ రాంబాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఏపీ సీఆర్డీఏ (AP CRDA) తరఫున జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ చిరాన్ రాయ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా-పెరల్ ట్రస్ట్ కార్యానిర్వాహక కార్యదర్శి అశోక్ కుమార్ పాండే సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. రాజధాని అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో 55 ఎకరాల భూమిని భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ – పెరల్ ఫస్ట్‌కు ఏపీ సీఆర్డీఏ కేటాయించింది. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, బీసీఐ ట్రస్ట్ – పెరల్ ఫస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రాజ్యసభ సభ్యుడు మనన్‌కుమార్ మిశ్రా (Manan Kumar Mishra) ఆలోచనతో ఈ పాజ్రెక్టు ప్రారంభమైంది. విశ్వవిద్యాలయ ప్రాంగణ నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పెరల్ ఫస్ట్ సుమారు రూ.300 కోట్ల పెట్టుబడిని అమరావతిలో దశలవారీగా పెట్టాలని ప్రణాళిక రూపొందించింది. ప్రాజెక్టు ప్రారంభ దశలోనే 200 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








