Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సహా ఆరు రాష్ట్రాలకు ప్రకతి వైపరీత్యాల సహకారం కింద రూ.1929.99 కోట్ల సాయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి కమిటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, జమ్మూకశ్మీర్‌లకు అదనపు కేంద్ర సహాయానికి ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించింది. 2025లో సంభవించిన ఆకస్మిక వరదలు, మొంథా తుపాను ప్రభావిత రాష్ట్రాలకు సాయాన్ని ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.341.48 కోట్ల అదనపు సాయం అందించనున్నారు.
ఇవి కూడా చదవండి








