ఢిల్లీలో మంత్రి లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు స్వాగతం
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఢిల్లీ చేరుకున్నారు. పబ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇండియా 3.0 ఎంగేజింగ్ ఫర్ గ్రోత్ ఇన్ ఏ డిస్ప్యూటెడ్ వరల్డ్ అనే అంశంపై జరిగే చర్చలో ప్రసంగించనున్నారు. సదస్సులో పలువురు కేంద్రమంత్రులు (Union Ministers), విదేశీ ప్రతినిధులు, వివిధ సంస్థల అధిపతులు పాల్గొననున్నారు. ఢిల్లీ (Delhi) చేరుకున్న లోకేశ్‌కు టీడీపీ ఎంపీలు (TDP MPs) స్వాగతం పలికారు. అనంతరం ఆయన వారితో సమావేశమై వర్తమాన రాజకీయాంశాలపై చర్చించారు.








