ప్రతిష్టాత్మకంగా మహాసభలు…
ప్రతి 2 సంవత్సరాలకు ఒక్క సారి జరుపుకునే ప్రపంచ తెలంగాణ మహాసభలు-2018, ఈసారి జూన్ 29,30, జూలై 1, 2018 మూడు రోజుల పాటు హ్యూస్టన్, టెక్సాస్ లోని, జార్జ్ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నాం. ఈ మహాసభలలో … తెలంగాణను ఎలా అభివ ద్ధి చేసుకోవాలి.. సతత హరిత, బంగారు తెలంగాణగా ఎలా తీర్చిదిద్దాలి అన్న విషయాలపై చర్చించి తెలంగాణ ప్రభుత్వానికి ఈ సూచనలను తెలియజేస్తాం. మహాసభల్లో వివిధ కార్యక్రమాలను అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నాము.
రచ్చ బండ కార్యక్రమంలో వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో చర్చించి రైతులకు ఉపయోగపడేలా సూచనలు చేయనున్నాము. యువతరం కోసం ప్రత్యేక కార్యక్రమం, సాహిత్య కార్యక్రమానికి సంబంధించి వివిధ సదస్సులు ఏర్పాటు చేశాము. భద్రాచలం నుండి పూజారులు వచ్చి అక్కడి ఉత్సవ విగ్రహాలు, ప్రసాదంతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణం చేయనున్నారు.
మన తెలంగాణ సమాజాన్ని మరోసారి ఏకీకతం చేసే బహత్ కార్యక్రమానికి ఆటా-తెలంగాణ శ్రీకారం చుట్టింది. మాతభూమి బంగారు తెలంగాణగా..హరిత తెలంగాణగా మారే క్షణం కోసం పరితపిస్తూ ప్రపంచ నలుమూలలలో విస్తరించిన ప్రవాస తెలంగాణ సోదర సోదరీమణులు మరోసారి ఈ వేదికగా కలుసుకోగలగటం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
అమెరికా నలుమూలలా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మహాసభలలో పాల్గొని మా ఆతిధ్యాన్ని స్వీకరించి, విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల,
అధ్యక్షులు













