భారత్ ను శాశ్వత సభ్యదేశంగా మార్చేందుకు మద్దతు : డార్టీ పాచికో
ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు డార్టీ పాచికో ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు. పోర్చుగల్, భారత్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. రెండు దేశాల మధ్య 500 ఏళ్ల నాటి బంధం ఉందని, ఒకరికి ఒకరు బాగా తెలుసు అని, కేవలం మిత్ర దేశాలు మాత్రమే కాదు అని, మనం సోదరుల్లా ఉన్నామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్‌ది అని పాచికో అన్నారు. అన్ని స్థాయిల్లోనూ, స్థానిక నుంచి జాతీయం వరకు మహిళలు, యువకులతో దేశం సమగ్రంగా కనిపిస్తోందని డార్టీ ప్రశంసించారు. ప్రతి ఒక్కరి రాజకీయ, మతపరమైన భావాలకు భారత్ గౌరవం ఇస్తుందని ఆయన అన్నారు. ఐక్యారాజ్యసమితిలో జరిగే సంస్కరణలకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని, యూఎన్‌లో భద్రతా మండలిలో భారత్‌ను శాశ్వాత సభ్యదేశంగా మార్చేందుకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని డార్టీ తెలిపారు.













