ట్విట్టర్ కు గ్రీవెన్స్ ఆఫీసర్ గుడ్ బై

ట్విట్టర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ ఉద్యోగానికి ధర్మేంద్ర ఛాతుర్ రాజీనామా చేశారు. ఈ మేరకు ట్విట్టర్ తమ అధికారిక వెబ్‍సైట్ నుంచి ఆయన పేరును తొలగించింది. ఛాతుర్ వైదొలగడానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై ట్విటర్ కూడా ఇంకా స్పందించలేదు. కొత్త ఐటీ నిబంధనల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం.